calender_icon.png 22 April, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ రైల్వే స్టేషన్ కామారెడ్డి

21-04-2025 10:06:31 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి,(విజయక్రాంతి): మోడల్ రైల్వే స్టేషన్ గా కామారెడ్డి నీ తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం కామారెడ్డి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ఆయనతోపాటు  జైహి రాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ తో కలిసి రైల్వే అధికారులను పనుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా రైల్వే స్టేషన్ ప్రవేశ దారి, వెడల్పు పనుల్లో 28 మీటర్లు, మాత్రమే వెడల్పు చేయాలని మధ్యలో నుండి 14 మీటర్లు ఎడమవైపు 14 మీటర్లు కుడివైపు ఉన్న షాపులు మాత్రమే తొలగించాలన్నారు.

షాపులు పోయిన యజమానులకు త్వరలో రైల్వే డిపార్ట్మెంట్ వారు నిర్మించే దుకాణ సముదాయాల్లో వారికి కేటాయించాలన్నారు. రైల్వే ప్రయాణికులకు మరుగుదొడ్లు లేక చాలా అసౌకర్యంగా ఉందన్నారు.  రైల్వే గేటు వద్ద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మూడు నుంచి ఆరు నెలల లోపు నిర్మించాలని అధికారుల ను ఆదేశించారు. ఎంపీ సురేష్ షట్కర్ మాట్లాడుతూ... ఏఆర్ఎస్ఎస్ స్కీంలో భాగంగా కామారెడ్డి రైల్వే స్టేషన్ మోడల్ రైల్వే స్టేషన్ గా నిర్మించబడుతుందన్నారు. స్థానికుల సౌకర్యం కొరకు రెస్ట్ రూమ్ నిర్మించడం జరుగుతుందన్నారు.

ప్రయాణికుల కొరకు  క్యాంటీన్ నిర్మాణం  జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులు రెండో నెంబర్ ప్లాట్ ఫారం. పై ట్రైన్లు ఎక్కువ నిలుస్తున్నాయని ఇబ్బందులు పడుతున్నారని షబ్బీర్ అలీ  దృష్టికి స్థానికులు తేవడంతో  వెంటనే అధికారులకు సాధ్యమైనంత వరకు ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై ట్రైన్ లు నిలపాలని అన్నారు. పాత రాజంపేట వద్ద ఒకటి, కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు నుండి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి కొరకు ప్రతిపాదనలు పంపించినట్లు  త్వరలో అవి పూర్తవుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డిఓ వీణ, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, టిపిఎస్ లు, తదితర అధికారులు,  నాయకులు పాల్గొన్నారు.