12-03-2025 07:57:34 PM
ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ను తనిఖీ
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వం మహిళా సాధికారత కోసం మహిళ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కామారెడ్డి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి(Kamareddy Additional Collector Srinivas Reddy) అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా దోమకొండలో మహిళా సంఘాల సభ్యులను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్(Indira Mahila Shakti Canteen)ల ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి చెందవచ్చని అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రారంభం అయిన మహిళా శక్తి క్యాంటీన్ ను ఆయన సందర్శించి మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఎంపిడివో కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఈ నెల 31 వరకు తమ యొక్క ఫీజు ఆన్ లైన్ లో చెల్లింపులు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంపిడివో ప్రవీణ్ కుమార్, సిబ్బంది, పాల్గొన్నారు.