రాజేంద్రనగర్, జనవరి19: మల్లికార్జున స్వామి అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మల్లన్న స్వామి ఆలయంలో నిర్వహించిన మల్లికార్జునస్వామి కల్యాణోత్సవంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతి సంవత్సరం కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం మాదిరిగా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా అష్టఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, నార్సింగి మున్సిపల్ చైర్ పర్సన్ నాగపూర్ణ వెంకటేష్, నార్సింగ్ కి మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.