calender_icon.png 18 January, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమాన్ భారత్

04-08-2024 12:28:42 AM

నేడు శ్రీలంకతో రెండో వన్డే

కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో చేజేతులా విజయాన్ని దూరం చేసుకున్న టీమిండియా నేడు రెండో వన్డేకు సిద్ధమైంది. కొలంబో వేదికగా జరగనున్న మ్యాచ్‌లో రోహిత్ సేన విజయంపై కన్నేసింది. తొలి వన్డేలో ఎవరు ఊహించని విధంగా ఫలితం టై కావడం భారత అభిమానులను షాక్‌కు గురి చేసింది. బ్యాటింగ్ విషయానికొస్తే.. కెప్టెన్ రోహిత్ మినహా మిగతావారెవరు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఫామ్‌లో ఉన్న కోహ్లీ నిరాశపరచగా.. మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ పర్వాలేదనిపించారు. ఓపెనింగ్ నుంచి ఏడో స్థానం వరకు పేపర్‌పై బ్యాటింగ్ బలంగానే ఉంది. సిరాజ్, అర్ష్‌దీప్, సుందర్, కుల్దీప్, అక్షర్‌లతో కూడిన బౌలింగ్ విభాగం తొలి వన్డేలో మంచి ప్రదర్శన చేసింది. రెండో వన్డేలోనూ అదే జోరు చూపాలని భావిస్తోంది. టీ20 సిరీస్‌ను కోల్పోయినప్పటికీ తొలి వన్డేలో ఓటమి అంచుల నుంచి మ్యాచ్ టైగా మలచడంలో లంక విజయవంతమైంది. అసలంక, నిసాంక, హసరంగాలు ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. మ్యాచ్‌ను టైగా ముగించి రెట్టించిన ఆత్మవిశ్వాసం సాధించిన లంక  రెండో వన్డేలో విజయం సాధిం చాలని ఉవ్విళ్లూరుతోంది.