calender_icon.png 7 November, 2024 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేల్లో ట్రంప్‌పై కమలదే పైచేయి

06-08-2024 02:30:44 AM

కొన్ని రాష్ట్రాల్లో పోటాపోటీ తప్పదంటున్న సర్వేలు

హ్యారిస్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ మద్దతు

వాషింగ్టన్ (అమెరికా): అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్న కమలాహ్యారిస్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారని ప్రముఖ న్యూస్ సంస్థ సీబీఎన్ విడుదల చేసిన పోల్ సర్వేలో తేలింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోటాపోటీ తప్పదని సంస్థ తెలిపింది.

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సొంతపార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఇటీవల అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తన స్థానంలో అమెరికా ఉపాధ్యక్షు రాలు కమలను డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అమెరికా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తూనే ఉన్నాయి. అప్పటివరకు అన్ని సర్వేలలో ముందంజలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ క్రమంగా వెనకబడుతూ వస్తున్నారు. 

కమలకు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మద్దతు పలికారు. ఈ విషయాన్ని ఆయన మనవడు జాసన్ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్న విషయం తెలిసిందే.