calender_icon.png 16 January, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలానే కాబోయే అధ్యక్షురాలు

21-10-2024 12:00:00 AM

  1. చరిత్రాత్మక తీర్పునకు అమెరికా సిద్ధంగా ఉంది
  2. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: చరిత్రాత్మక తీర్పునిచ్చేందుకు అమెరికా ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.  డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఒబామా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై నిప్పులు చెరిగారు.

ట్రంప్ ఎప్పుడూ తన అహం, డబ్బు, హోదా గురించి మాత్రమే పట్టించుకుంటాని విమర్శించారు. మధ్యతరగతిలో పెరిగిన కమలా హారిస్.. కళాశాలలో ఉన్నప్పుడు తన ఖర్చులను చెల్లించడానికి మెక్‌డొనాల్డ్‌లో పనిచేసింది. ఆమెకు కష్టం అంటే ఏంటో తెలుసు. ఈ దేశాన్ని నడిపించగల శక్తి, సామర్థ్యాలు ఆమె దగ్గర పుష్కలంగా ఉన్నాయి. మీరు కమల, టిమ్‌ను ఎన్నుకుంటే వారు మీ సమస్యలపై దృష్టి పెడతారు అని ఒబామా అన్నారు.