calender_icon.png 18 November, 2024 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలా యే క్యా హై!

18-11-2024 12:42:29 AM

వాషింగ్టన్ డీసీ, నవంబర్ 17: ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ప్రచారంలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ బృందం ఆ పార్టీకి వచ్చి న విరాళాలను ఖర్చుపెట్టిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. హారిస్ బృందం కేలవం ఫుడ్ డెలివరీలు, ఐస్‌క్రీమ్‌ల కోసమే 24వేల డాలర్లు (రూ.20లక్షలు) ఖర్చుపెట్టినట్లు ది టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. కమల బృందా నికి డెమోక్రాట్ల తరఫున ఎన్నికల్లో పోరాడేందుకు దాదాపు 150 కోట్ల డాలర్ల నిధులను దాతలు అందించారు.

అయితే వాటిని కమల బృందం ఇష్టారీతిన ఖర్చుపెట్టిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయమై కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యుడు రోఖన్నా మాట్లాడుతూ.. ‘దేశం మొత్తం కాన్సర్ట్‌లు పెట్టి 100 కోట్ల డాలర్లను వృథా చేయడం ఎంతవరకు సబబు’ అని కమల బృందంపై విమర్శలు చేశారు. ఫుడ్‌తో పాటు ప్రైవేట్ జెట్ల ప్రయాణానికి కమల బృందం భారీగా ఖర్చుచేసింది. ప్రైవేట్ జెట్లకు ఏకంగా 26 లక్షల డాలర్లు (రూ.21 కోట్లు) చెల్లించినట్లు సమాచారం. వచ్చిన విరాళాల కంటే ఇంకా అదనంగా ఖర్చు చేసినట్లు కమల బృందంపై ఆరోపణలు రావడంతో డెమక్రాట్ పార్టీ ఆత్మ పరిశీలనలో పడినట్లుంది.