అమెరికాలో కొత్త డిమాండ్
వాషింగ్టన్, నవంబర్ 11: అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్నది. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయన దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే వరకూ కమలా హ్యారిస్‌కు ఆ పదవి అప్పగించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది.
కమల మాజీ కమ్యూనికేషన్ విభాగ డైరెక్టర్ జమాల్ సిమన్స్ ఓ టాక్‌షోలో ఈ విషయా న్ని ప్రస్తావించి సంచలనానికి తెరలేపారు. బైడెన్ ఒకవేళ తన పదవికి రాజీనామా చేసి కమలాకు పదవి అప్పగిస్తే, ఆమె అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా కొత్త రికార్డు ను నమోదు చేస్తారని జమాల్ సిమన్స్ వెల్లడించారు. జోబైడన్ గతంలో కమలాకు ఇదే హామీ ఇచ్చారని గుర్తుచేశారు.