19-04-2025 07:10:37 PM
శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్న లైన్స్ క్లబ్ సభ్యులు...
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం లైన్స్ క్లబ్ 2025-26 సంవత్సరానికి అధ్యక్షులుగా పి. కమలా రాజశేఖర్ ని లైన్స్ క్లబ్ సభ్యులు శనివారం ఎన్నుకున్నారు. ఈ ఏడాది మే నెల వరకు ప్రస్తుత అధ్యక్షులు రామలింగేశ్వర రావు కొనసాగనుండగా జూన్ 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే లైన్ స్టిక్ సంవత్సరానికి కమల రాజశేఖర్ ఎన్నికయ్యారు. భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ రాజశేఖర్ సతీమణి కమలా రాజశేఖర్. లైన్స్ క్లబ్ అధ్యక్షురాలుగా ఎన్నికైన కమల రాజశేఖర్ సామాజిక సేవలో ముందుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
జీయర్ మఠం నిర్వాహకులుగా శివానంద ఆశ్రమం సభ్యులుగా పని చేస్తూ పట్టణంలోని ఏ సామాజిక కార్యక్రమం జరిగిన ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ప్రస్తుత అధ్యక్షులు సిహెచ్ రామలింగేశ్వర రావు కమల రాజశేఖర్ పేరును ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కమల రాజశేఖర్ మాట్లాడుతూ... సభ్యులందరూ తనపై నమ్మకంతో ఉంచిన బాధ్యతను తూచా తప్పకుండా అమలు చేసి లైన్స్ క్లబ్ భద్రాచలం కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని రావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే సభ్యులందరూ ఈరోజు ఎన్నుకున్నట్లుగానే ఏడాది ఎంత తనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ నేతలు యోగి సూర్యనారాయణ అలుసుమిల్లి జగదీష్ హరిచంద్ర నాయక్ సీతారాం రెడ్డి జిఎస్ శంకర్రావు పరిమి సోమశేఖర్, జక్కం ప్రసాద్, గాదె మాధవరెడ్డి ,వివేకానంద, నక్క వెంకన్న, మినిస్టర్ కృష్ణ చారి ఉమామహేశ్వరరావు సిద్ధారెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.