calender_icon.png 8 January, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమల ఓ చాంపియన్

07-12-2024 01:44:15 AM

వాషింగ్టన్, నవంబర్ 7: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడినప్పటికీ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ అమెరికన్లందరికీ చాంపియన్‌గా నిలిచిందని, రానున్న తరాలకు ఆమె మార్గదర్శిగా నిలు స్తారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.  ఈ మేరకు ఎక్స్ వేదికగా కమల ఓటమిపై బైడెన్  పోస్ట్ చేశారు. హారిస్ ఓటమి చెందినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగిస్తారని, అసాధారణ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిగా వచ్చి ప్రచారాన్ని తన భుజస్కందాలపై మోశారని ప్రశంసించారు.

కమల చాలా ధైర్యం ఉన్న ప్రజాసేవకురాలని, అమెరిక్లనకు స్వేచ్ఛ, న్యాయం, మరిన్ని అవకా శాలు రావాలని బలంగా కోరుకున్న వ్యక్తిని అమెరికా చూసిం దని అన్నారు. తనపై ఉన్న నమ్మకంతోనే 2020 ఎన్నికల్లో ఆమెను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకున్నానని పేర్కొన్నారు. ఆమె కథ అమెరికాకు స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు. ఓటమి అనంతరం కమలతో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు. కాగా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్  ట్రంప్‌నకు బైడెన్ ఫోన్‌లో అభినందనలు తెలిపినట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అయితే కమలా హారిస్ ఓటమిపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ తాము ఆశించిన ఫలితం ఇది కాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.