calender_icon.png 26 December, 2024 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యక్షురాలిగా కమల విఫలం

03-11-2024 02:26:05 AM

ఆమె విధానాలతో వేల ఉద్యోగాలు కోల్పోయాం

నేను అధికారంలోకి వస్తే ద్రవ్యోల్బణం కట్టడి చేస్తా

ఎన్నికల ప్రచారంలో ట్రంప్ 

ట్రంప్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న కమల

వాషింగ్టన్, నవంబర్ 2: ఈ నెల 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్య ర్థులైన డొనాల్డ్ ట్రంప్, కమల హ్యారిస్‌లు ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శలకు పదును పెడుతున్నారు. మిషిగన్‌లోని డెట్రాయిట్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొని హ్యారిస్ విధానాలను తప్పుపట్టారు. కమల విధానాలు దేశాన్ని నాశనం చేసేలా ఉన్నాయని ఆరోపించారు. వాటివల్ల అమెరికన్ కార్మికులకు నష్టం వాటిల్లుతుందని, హ్యారిస్‌ను రాడికల్ లెఫ్ట్ మార్క్సిస్ట్‌గా అభివర్ణించారు.

ఆమె అధికారంలో వస్తే ప్రజ ల వద్ద తుపాకులను జప్తు చేస్తానంటూ ప్రతి జ్ఙ చేశారన్నారు. కానీ తాను మాత్రం దేశంలోని ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని పేర్కొ న్నారు. పన్నుల భారం తగ్గించి ప్రజల సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యక్షు రాలిగా కమలా హ్యారిస్ విఫలమైందని విమర్శించారు. ఆమె విఫల ఆర్థిక అజెండా కారణంగా ప్రైవేటురంగంలో 30వేలు, తయారీ రంగంలో 50వేల ఉద్యోగాలను కోల్పోయామని ఆరోపించారు. తాజా ఎన్నికల్లో కమల గెలిస్తే దేశం ఆర్థిక విపత్తులను ఎదుర్కోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. 

ప్రపంచ యుద్ధం రాకుండా చూస్తా

ప్రచారంలో భాగంగా రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. దేశ సమస్యలే కాకుం డా ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ష్య్రా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా ఆపడానికి ప్రయత్నిస్తానన్నారు. ఇలా మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను చేపడతానన్నారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. 

ట్రంప్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: కమల

ట్రంప్ విజయం సాధిస్తే అమెరికన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా తన రాజకీ య ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అధికారాన్ని వినియోగిస్తారని కమల ఆరోపించారు. ట్రంప్ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడు తున్నారని మండిపడ్డారు. ప్రపంచానికి ఆదర్శంగా కనిపించే నాయకుడు అమెరికా అధ్యక్షుడిగా ఉండాలన్నారు. దేశానికి ట్రంప్ కంటే మెరుగైన అధ్యక్షుడు అవసరమని కమల అభిప్రాపడ్డారు. ఎన్నికల ప్రచార ర్యాలీలో తనకు ఎదురవుతున్న అవాంతరాలను కమల హ్యారిస్ అవకాశాలుగా మల్చుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తన వాదనను మరింత బలంగా ప్రజలకు వినిపిస్తున్నారు. నార్త్ కరోలినా, పెన్సల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కమల బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొంత మంది పాలస్తీనా మద్దతు దారులు ఆమె ప్రసంగానికి అడ్డుతగిలారు. ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పట్ల బైడెన్, కమల హ్యారిస్ విధానాన్ని తప్పుపడుతూ నినాదాలు చేశారు. అలాగే మరికొంత మంది పాలస్తీయన్ కమ్యూనిటీని హ్యారిస్ అవమాన పరిచినట్లు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో కమల మాట్లాడుతూ ట్రంప్‌పై విమర్శలను ఎక్కుపెట్టారు. ‘మనందరికీ తెలుసు మనం నిజానికి ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాం. మీతో విబేధించే వారిని శత్రువుగా భావించే మనస్తత్వం ట్రంప్‌కు మాత్రమే ఉంది. కానీ నాకు అలాంటి మనస్తత్వం లేదు’ అన్నారు. కొన్ని సందర్భాల్లో క్లిష్టతరమైనప్పటికీ ప్రపంచంలో అత్యంత ఉత్తమ వ్యవస్థ ప్రజాస్వామ్యమే అన్నారు. అలాగే గాజాలో యుద్ధం ముగియడానికి, బందీలను బయటకు తీసుకురా వడానికి తాను చేయగలిగిందంతా చేస్తానని కమల హామీ ఇచ్చారు.