నేనొస్తే వారికి స్వేచ్ఛ కల్పిస్తా
రాడికల్ లెఫ్ట్ నుంచి రక్షిస్తా
దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్
వాషింగ్టన్, నవంబర్ 1: అమెరికా అధ్యక్షుడు బైడెన్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ హిందువులను పట్టి ంచుకోవట్లేదంటూ రిపబ్లికన్ అభ్యర్థి డొనా ల్డ్‌ట్రంప్ విమర్శలు గుప్పించారు. తాను అధికారంలోకి వస్తే హిందువుల స్వేచ్ఛకై పోరాడతానని హామీ ఇచ్చారు. దీపావళి వేడుకల సందర్భంగా ట్రంప్ పోస్ట్ పెట్టారు. హిందువులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ చెడుపై మంచి విజయం సాధించేలా చేస్తుందనే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికాలోని భారతీయుల సమస్యలను పరిష్కరి స్తానన్నారు. ముఖ్యంగా రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీని తన స్నేహితుడిగా అభివర్ణించిన ట్రంప్ ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే భారత్‌తో బలమైన బంధాన్ని ఏర్పరుస్తానన్నారు.
బంగ్లాలో హిందువులపై దాడిని ఖండించిన ట్రంప్
బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులతోపాటు ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అల్లరి మూకలు హిందువుల ఇళ్లు, దుకాణాలపై దాడి చేసి, దోపిడీలకు పాల్పడిన విష యాన్ని గుర్తు చేశారు. బంగ్లాలో భయానక పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులున కమలా హ్యారిస్, బైడెన్‌లు విస్మరించినట్లు ఆరోపించారు. అమెరికాలో జావి వివక్ష పేరుతో జరిగిన దాడులను అడ్డుకోవడంలో కూడా బైడెన్, హ్యారిస్‌లు విఫలమయ్యారని ట్రంప్ విమర్శించారు.
మహిళలను ట్రంప్ అవమానించారు: కమల
ఎన్నికల ర్యాలీలో భాగంగా బుధవారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కమలా హ్యారిస్ తీవ్రంగా ఖండించారు. తాను అధికారంలో వస్తే మహిళలకు ఇష్టం ఉన్నా లేకున్నా వారి రక్షణను దృష్టిలో ఉంచుకుని అబార్షన్‌ను బ్యాన్ చేస్తా అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కమల హ్యారిస్ మండిపడ్డారు. ట్రంప్ మాటలు ప్రతి ఒక్కరిని అవమానపరిచే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల తెలివితేటలు, తమ జీవితాల గురించిన నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకోవడాన్ని గౌరవించని వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించారు.
ఓటేసిన 6 కోట్ల మంది
అగ్రరాజ్యంలో నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అయితే అక్కడి ప్రజలు పోలింగ్ తేదీకి ముందే తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే దాదాపు 6.1 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కను వినియోగించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ ముందుస్తు ఓటింగ్ ప్రక్రియలో కొందరు నేరుగా పోలింగ్ కేంద్రాలకే వెళ్లి ఓటు వేయగా మరికొందరు మెయిల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇప్పటి వరకు నిర్వహించిన పలు సర్వేల్లో డొనాల్డ్ ట్రంప్ కంటే.. కమలా హ్యారిస్ కొంచెం ముందంజలో ఉన్నట్లు సమాచారం.