13-02-2025 12:49:02 AM
చెన్నై: సినీ నటుడు కమల్ హాసన్ త్వ రలో రాజ్యసభ లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీఎంకే తరఫున కమల్ రా జ్యసభకు నామినేట్ అయ్యే చాన్స్ ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మ ద్దతు ప్రకటించిన కమల్‌ను రాజ్యసభకు పం పాలని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ యో చనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జూన్‌లో రాజ్యసభ నుంచి ఆరు సీట్లు ఖాళీ కానున్నాయి. బుధవారం తమిళనాడు మం త్రి పీకే శేఖర్ బాబు కమల్ నివాసానికి వెళ్లి ఆయనను కలవడం వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయింది. 2018 ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ (ఎన్‌ఎంఎం) పార్టీని మధురైలో స్థాపించా రు. కానీ అప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికల్లో నూ కమల్ పార్టీ ప్రభావం చూపలేకపోయి ంది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీసారి ఓట్ షే ర్ వచ్చినప్పటికీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది.