calender_icon.png 18 November, 2024 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ రాష్ట్రాల్లో కమలదే ఆధిక్యం

12-08-2024 12:33:15 AM

మూడు కీలక రాష్ట్రాల్లో న్యూయార్క్ టైమ్స్ సర్వే

వాషింగ్టన్(అమెరికా), ఆగస్టు 11: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ౩ నెలల సమయం మాత్రమే ఉండగా.. అనూహ్యంగా అధికార డెమోక్రటిక్ పార్టీ నుంచి బరిలో నిలిచిన కమలాహారిస్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పూర్తి ఆధిక్యతను చూపుతున్నారు. అధ్యక్ష మార్పునకు ముందు సర్వేలన్నీ ట్రంప్‌కు ఆధిక్యం చూపిస్తుం డగా.. బైడెన్ వైదొలగడం, కమల అభ్యర్థిగా ఖరారు కావడంతో అమెరికా రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి.

కమల అధ్యక్ష అభ్యర్థి అయ్యిందే తడువు సర్వేలన్నీ ఆమె వైపే మొగ్గుచూపుతున్నాయి. దేశంలోని ౩ ముఖ్య రాష్ట్రాలుగా పిలువబడే  విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగాన్‌లో ఇటీవల న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలొ 50శాతం మంది ఓటర్లు కమలా హారిస్‌కు మద్దతు పలుకగా, 46శాతం మంది ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. అంటే కమలా హారిస్ ట్రంప్ కంటే దాదాపు 4శాతం ఓట్ల ముందంజలో ఉన్నారన్నమాట.  అయితే నవంబర్ 5వ తేదీకి ఇంకా చాలా సమయం ఉందని.. అప్పటివరకు ఎలాంటి మార్పు అయినా సాధ్యమేనని రిపబ్లికన్ పార్టీ సపోర్టర్లు అంటున్నారు.