calender_icon.png 22 December, 2024 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయుడు-2 టికెట్ ధరల పెంపు.. ఎంతంటే?

10-07-2024 06:51:14 PM

హైదరాబాద్: భారతీయుడు 2 ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం విడుదలైన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. కమల్‌హాసన్‌ నేతృత్వంలోని చిత్రబృందం ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసింది. టాపిక్‌కి వస్తే, ఇండియన్ 2 కోసం టిక్కెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీఫెక్స్ లో రూ. 75 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 19 వరకు పెరిగిన టికెట్ ధరలు వసూలు చేయనున్నారు. వారం రోజుల పాటు ఐదో షో ప్రదర్శనకు తెలంగాణ సర్కార్ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

భారతీయుడు మొదటి భాగం 1996లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. దూరదృష్టి కలిగిన చిత్రనిర్మాత శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో నటించి అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించారు. సంవత్సరాల నిరీక్షణ తర్వాత, శంకర్ భారతీయుడు 2తో తిరిగి వచ్చాడు. బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించడంలో శంకర్‌కు మంచి రికార్డులున్నాయి. దీంతో ఈ సీక్వెల్ కు భారీగా హైప్ పెరిగింది. భారతీయుడు-2 సిన్మా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.