calender_icon.png 18 January, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణి లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొండ సురేఖ

18-01-2025 04:11:35 PM

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట, నర్సింగ్ మండలాల ఉన్న 90 మంది కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను జిల్లా ఇంచార్జ్, దేవాదాయ, అడవి శాఖ, పర్యాటక మంత్రి వర్యులు శ్రీమతి శ్రీ కొండ సురేఖ(Minister Konda Surekha), దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Kota Prabhakar Reddy) ఆధ్వర్యంలో గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం స్టేజిపై ప్రోటోకాల్ వివాదం నేలకోంది. వేదికపై దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి(Congress party incharge Cheruku Srinivas Reddy) వేదికపైన కూర్చోడంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా చిల్లర రాజకీయలు చేస్తే సహించేది లేదు నేను దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులతో, నిధులు తెచ్చి అభివృద్ధి చేసుతున్న అని అన్నారు. అనంతరం ఇరు పార్టీల మధ్య తోపులాట, నినాదాలతో మారుమోగినాయి. చివరికి పోలీస్ లు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను శాంతింప చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రాహుల్ రాజ్, తూప్రాన్ ఆర్ డి ఓ, జయ చంద్ర రెడ్డి, చేగుంట తాహసిల్దార్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.