calender_icon.png 22 February, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి వారి కల్యాణ వైభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో 108 కల్యాణాలు

21-02-2025 01:04:28 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): లోక కల్యాణార్థం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున 9 సంవత్సరాల పాటు 108 లక్ష్మినర్సింహాస్వామి వారి కల్యాణాలను నిర్వహిస్తున్నామని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ వైభవ ట్రస్ట్ అధ్యక్షుడు, జగిని ఫర్నిచర్ అధినేత జగిని శ్రీనివాస్‌గుప్తా గురువారం ఓ సమావేశంలో తెలిపారు.

108 కల్యాణాత్సోవాలు జరిపించాలానే సంకల్పంతో 9 మందితో ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 4, 2022 నుంచి  నిర్వహిస్తున్నామని ఇప్పటివరకు 37 ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. 2031 ఫిబ్రవరి వరకు మిగిలిన 71 కల్యాణోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

భక్తులు తమ ఇంట్లో స్వామివారి కల్యాణం నిర్వహించతలిస్తే తమను సంప్రదించాలన్నారు. తాము స్వాతి నక్షత్రం రోజున యాదగిరిగుట్టలో ఉదయం గిరి ప్రదక్షిణ నిర్వహించి, అనంతరం కల్యాణ మహోత్సవాన్ని వారి ఇంటి వద్దనే నిర్వహిస్తామని తెలిపారు. ఏటా 12 ఉత్సవాలు మాత్రమే నిర్వహిస్తామన్నారు.

ఇంట్లో స్వామి వారి కల్యాణం జరుపాలనుకునే భక్తులు 9246736533, 9848066156 నంబర్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గుబ్బ లింగేశ్వర్‌గుప్తా, కోశాధికారి వాడకట్టు నరేందర్‌గుప్తా, ఉపాధ్యక్షులు చింతల సంఘమేశ్వర్‌గుప్తా, గజవెళ్లి సాంబమూర్తిగుప్తా, పీఆర్వో నాంపల్లి శ్రీనివాస్, సభ్యులు చందా భాస్కర్, జూలూరు శ్రీనివాస్, గాద శ్రీనివాస్ పాల్గొన్నారు.