calender_icon.png 8 October, 2024 | 10:13 AM

గజ్వేల్‌లో కల్యాణలక్ష్మిలొల్లి

08-10-2024 02:29:01 AM

చెక్కులు పంచడం లేదంటూ కాంగ్రెస్ నేతల ఆందోళన

ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో చొరబడిన కార్యకర్తలు

గజ్వేల్, అక్టోబర్ 7: గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ వ్యవహారం రోజురో జుకూ గొడవకు దారితీస్తోంది. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ లబ్ధిదారులకు కల్యాణల, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు న్నారని..

దసరాలోపు చెక్కులను పంపిణీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. క్యాంపు కార్యాలయంలోని సీఎం కేసీఆర్ చిత్రపటానికి వినతిపత్రాలను అందజేశారు. మిగతా నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు కల్యాణల క్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ జరుగుతున్నా గజ్వేల్‌లో కేసీఆర్ లేకపోవడం వల్లే చెక్కుల పంపిణీ నిలిచిపోతున్నాయన్నారు.

దసరాలోపు కల్యాణలక్ష్మి చెక్కులను పంచాలని.. లేనిపక్షంలో కేసీఆర్ ఇంటిని చుట్టుము డతామని గజ్వేల్ ఎఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్‌ఖాన్, మాజీ మున్సి పల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ హెచ్చరించా రు. కాగా కాంగ్రెస్ నాయకులు అక్రమంగా క్యాంపు కార్యాలయంలో చొరబడ్డారంటూ బీఆర్‌ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చా ర్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు గజ్వేల్  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.