calender_icon.png 3 April, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఇంటికి వెలుగు కళ్యాణలక్ష్మి

03-04-2025 12:54:43 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

రామాయంపేట, ఏప్రిల్ 2:రాష్ట్ర ప్రభు త్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. నార్సింగి మండల కేంద్రంలో,  రామాయణం పేట పట్టణంలో గురువారం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ  పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అయన పేర్కొన్నారు.   

నార్సింగ్ మండలంలో  7 లక్షల 812 రూపాయలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లబ్ధి పొందడం జరిగిందని, అలాగే రామాయంపేట పట్టణంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 18 లక్షల 20వేల రూపాయలు తొమ్మిది గ్రామాల్లోని 18 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది అన్నారు.

అలాగే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీలో భాగంగా 19 మందికి 9, లక్షల 77 వేల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నార్సింగ్ తాసిల్దార్ కరీం,రామాయంపేట తాసిల్దార్ రజని, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.