calender_icon.png 1 April, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద కొడఫ్గల్ లో కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

30-03-2025 04:24:50 PM

పెద్ద కొడఫ్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి 40 చెక్కులు, షాదీ ముబారక్ ఒక చెక్కు, 9 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. అంజనీతండా, పోచారం, శివాపూర్, బేగంపూర్, కాస్లాబాద్ గ్రామాల్లో 50 మంది లబ్ధిదారులకు  పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు హైమద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.