లబ్ధిదారులకు 290 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్..
ముషీరాబాద్,(విజయక్రాంతి): సీఎం సహాయ నిధి పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం లోయర్ ట్యాంక్‌బండ్ లోని తహసిల్దార్ కార్యాలయంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్, హిమాయత్ నగర్ మండలంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 290 కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు రచన శ్రీ, రవి చారి, సుప్రియ నవీన్ గౌడ్, ఎమ్మార్వో రానా ప్రతాప్ సింగ్ లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పేదలు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ డివిజన్ ల అధ్యక్ష , కార్యదర్శులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.