calender_icon.png 19 April, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

11-04-2025 12:00:00 AM

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హనుమకొండ, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): అవినీతి రహిత పాలన అందించడమే నాలక్ష్యమని దీనికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్  లతో కలిసి  హాజరయ్యారు.

ఈ సందర్బంగా మండలానికి సంబందించిన 77మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 77లక్షల 08వేల 932రూపాయల విలువ గల చెక్కులను, 38మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 11లక్షల 99వేల రూపాయల విలువగల చెక్కులను మొత్తం 88లక్షల 07వేల 932రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా వెంటవెంటనే పరిశీలించి త్వరితగతిన దరఖాస్తుదారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందే విధంగా చూడాలని అధికారు లను ఆదేశించారు.

సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా దర ఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సహాయం చేరే విధంగా అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైన తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  శ్రీకారం చుట్టారని తెలిపారు.

అలాగే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో పాటు అన్ని వర్గాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి 6వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. 60వేల నుండి 4లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకాన్ని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులలో గాని, అమలు చేసే సంక్షేమ పథకాలలో కానీ ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాని దీనికి అధికారులు సహకరించాలని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఉన్నన్ని రోజులు నియోజకవర్గం లో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, ఆర్డివో వెంకన్న, ఇతర అధికారులు, మండల నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.