11-04-2025 01:02:20 AM
గజ్వేల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బిజెపి నాయకుల ధర్నా
గజ్వేల్, ఏప్రిల్10: గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 832 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వెంటనే పంపిణీ చేయాలంటూ గురువారం బిజెపి నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గజ్వేల్ బిజెపి మండల, పట్టణ అధ్యక్షులు అశోక్ గౌడ్ మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో అరగంట పాటు ఈ ధర్నా కొనసాగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకులు కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలను ఆందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.bగజ్వేల్ డివిజన్లో 832 కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పెండింగ్లో ఉన్నాయని వెంటనే వాటిని అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారని, చెక్కులు మాత్రం ఆర్డీవో కార్యాలయంలోనే మూలుగుతున్నాయని, కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్న వారి పట్టించుకునే నాధుడు కరువయ్యారన్నారు.
రాష్ట్రమంతటా చెక్కులు పంపి ణీ అవుతుంటే గజ్వేల్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు మాత్రం ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపితే గెలిపించిన ప్రజల మీదనే కక్ష సాధింపు చేస్తున్నారని, కెసిఆర్ తను సీఎంగా ఉండి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ చేయాలని జీవో ఇచ్చిన కెసిఆర్ ఫామ్ హౌస్ మత్తులో పడి మర్చిపోయాడన్నారు.
ఇప్పటికైనా వెంటనే ఫామ్ హౌస్ వీడి గజ్వేల్ కు వచ్చి పెండింగ్లో ఉన్న కల్యాణ లక్ష్మి షాది, ముబారక్ చెక్కులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలకు అందుబాటులో లేకుండా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను అలాగే ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ ను పెద్ద ఎత్తున కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులతో ముట్టడిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు కుడిక్యాల రాములు, ఎలకంటి సురేష్, నత్తి శివకుమార్, చెప్యాల వెంకట్ రెడ్డి, మన్నె శేఖర్, శ్రీనివాస్ రెడ్డి, పల్లె రమేష్ యాదవ్, మాడ్గురి నరసింహ ముదిరాజ్, నాగు ముదిరాజ్, పంజా బాలయ్య, నాయిని సందీప్ కుమార్, మంద వెంకట్, భాస్కర్ రెడ్డి, అర్కే యాదవ్, ప్రవీణ్ ,మైస విజయ్ తదితరులు పాల్గొన్నారు.