calender_icon.png 10 March, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

09-03-2025 04:14:24 PM

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపేట్ మండలంలో పలు గ్రామాలకు  చెందిన 26 మందికి కళ్యాణ లక్ష్మి  చెక్కులు 11 మందికి సియంఆర్ఎఫ్  చెక్కులు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ తెలిపారు. మండలంలోని అభివృద్ధి పనులలో భాగంగా రెండవ విడతలో ఎన్ఆర్ఈజిఎస్ కింద 70 లక్షల రూపాయలు మంజూరయ్యారని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషితో మండలంలో కోటి 60లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో మండల అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి 70-80 శాతం ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అయన అన్నారు.