మేడ్చల్ : కీసర మండల పరిషత్ కార్యాలయంలో 59 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్కులను మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అందజేశారు. ఈ సంధర్బంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి చెక్కు ముఖ్య ఉద్దేశం అప్పట్లో ఆడపిల్ల పెళ్లి పందిరిలో అందేలా చేయడం అని అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు చాల రోజుల నుండి పెండింగ్ లో ఉన్నాయి ఇంకా ఏమైనా ఉంటే త్వరగా లబ్దిదారులకు అందేలా చేయాలన్నారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు చాలా వరకు పంట నష్టం జరిగాయని అన్నారు. కావున రైతులు ఎంత మంది పంట నష్ట పోయారని వెంటనే చూసి వారికి తగిన సహాయం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందించాలి కోరారు. ఎఫ్ టీ ఎల్ లో కట్టుకున్న నిరుపేదలు ఉంటే వారికి దూరాన ఉన్న ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు.