calender_icon.png 28 September, 2024 | 12:53 AM

దుబ్బాకలో హాట్ హాట్‌గా చెక్కుల పంపిణీ

26-09-2024 04:06:47 PM

ఒకే వేదిక -మూడు పార్టీల నాయకులు 

ముదిరిన ప్రోటోకాల్ వివాదం -పోలిసుల జోక్యంతో సద్దుమనిగిన గొడవ 

దుబ్బాక,(విజయక్రాంతి): దుబ్బాకలోకళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి పోలీస్ పహార మధ్య స్థానిక కోమటిరెడ్డి రెడ్డి రజినీకాంత్ రెడ్డి ఫంక్షన్ హల్ లో హాట్ హాట్ హాట్ గా జరిగింది. ప్రోటోకాల్ వివాదం చిచ్చురేపింది.కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్టేజి పైకి రావడంతో కొద్దీసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోగా పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమానిగింది. చెరుకు శ్రీనివాస్ రెడ్డిని వేదిక పైనుండి కిందికిదింపాలంటూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరగడంతో అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.

కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వేదిక పైనే ఉండాలంటూ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో మంత్రి కొండా సురేఖ పలువురు లబ్దిదారులకు త్వరగా చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఒకే వేదిక పై మూడు పార్టీ ల నాయకులు ఉండడంతో కార్యకర్తల నినాదాల తో పోలీసులు తలలు పట్టుకున్నారు.