calender_icon.png 19 April, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్

16-04-2025 01:31:07 AM

ఎమ్మెల్యే గూడెంమహిపాల్‌రెడ్డి.. 272 మందికి చెక్కుల పంపిణీ

పటాన్ చెరు, ఏప్రిల్ 15 : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదల కు వరంగా మారాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలు, డివిజన్ల పరిధిలోని 272 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.2 కోట్ల 72 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే నాయకులతో కలిసి పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్, మాజీ జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ దేవానంద్, వెంకట్ రెడ్డి, షేక్ హుస్సేన్, ఆయా మండలాల తహసీల్దార్లు, తదితరులుపాల్గొన్నారు.