calender_icon.png 25 October, 2024 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణ్ రామ్ ఫైరింగ్ లుక్

06-07-2024 02:52:40 AM

శుక్రవారం నందమూరి కల్యాణ్ రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ఓ కొత్త పోస్టర్‌తో ట్రీట్ ఇచ్చింది #ఎన్‌కేఆర్21 టీమ్. ఈ పోస్టర్‌లో కల్యాణ్ రామ్ భయానకంగా కనిపించారు. ఆయన క్రూరమైన అవతారంలో కుర్చీపై కూర్చొని ఉండటాన్ని బట్టి చూస్తే ఆయన పాత్ర పవర్ ఫుల్‌గా ఉందనిపించింది. సినిమాలో ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం తెలిపింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా ప్రాజెక్టు వర్కింగ్ టైటిలే #ఎన్‌కేఆర్21.

ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంట్లో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇంకా సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటిం గ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు కల్యాణ్ రామ్ గతంలో నటించిన ‘బింబిసార’ మరో భాగం గురించిన ఉత్కంఠకు కూడా ఆయన బర్త్‌డే రోజు తెర పడింది. ‘బింబిసార కన్నా యుగాల ముందు త్రిగర్తలను ఏలిన లెజెండ్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ప్రీక్వెల్‌ను ప్రకటించారు చిత్ర నిర్మాతలు.