16-04-2025 12:00:00 AM
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న రిలీజ్ కానున్న సందర్భంగా నిర్మాతలు అశోక్‌వర్ధన్, సునీల్ విలేకరులతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘కల్యాణ్‌రామ్ ఎక్స్‌పెరిమెంటల్ ఫిలిమ్స్ ఎక్కువగా చేస్తున్నారు.
ఒక మాస్ కమర్షియల్ సినిమాను ఆయనతో చేయాలని ఈ కథను సిద్ధం చేయించాం. మంచి ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్. ప్రదీప్ కమర్షియల్ మీటర్ తెలిసిన డైరెక్టర్. ఈ కథకు ఆయన బెటర్ అనిపించింది. ఈ కథను విజయశాంతి ఓకే చేస్తారని మాకు గట్టి నమ్మకం. ఈ సినిమాను ఆమె ఒప్పుకోవడం ఆనందా న్నిచ్చింది. ఎన్టీఆర్ మొన్న ఈవెంట్లో చెప్పినట్లు చివరి ఇరవై నిముషాలు కళ్లు చెమ్మగిల్లెలా ఉంటుంది.
సెకండ్ హాఫ్ ప్రేక్షకులు ఫోన్ బయటికి తీయరు. ఎమోషన్ అంత ఎంగేజింగ్‌గా ఉంటుంది. ప్రతి యాక్షన్ సీన్ కథలో భాగంగానే వస్తుంది. కథానాయకుడిగా తన పాత్రకు ప్రాధాన్యం తగ్గుతుందేమోనని చాలా మంది హీరోలు ఆలోచిస్తారు. అందుకే మదర్ క్యారెక్టర్‌కు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడమనేది మామూలుగా జరగదు. కల్యాణ్ గొప్ప మనసుతోనే తల్లి పాత్ర ప్రాధాన్యమున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది” అన్నారు.