calender_icon.png 19 February, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైలట్ ప్రాజెక్ట్‌గా కల్వకుర్తి ఎంపిక

14-02-2025 12:59:38 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తలకొండపల్లి,ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామాలకు సైతం బిటీ రహదారుల నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుని అందుకు కల్వకుర్తి నియోజకవర్గాన్ని మొదటగా పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు.

తలకొండ పల్లి మండలం పడకల్, చుక్కాపూర్, పాతకోటతాండాలలో రూ.92 లక్షలతో మంజూరైన వివిద అభివృద్ది పనులకు గురువారం ఎమ్మెల్యే నారాయణరెడ్డి శంకు స్తాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని చెప్పారు.పాతకోటతాండా నుండి చెల్లంపల్లి వరకు నిర్మిస్తున్న బిటీ రోడ్డు పనులు నిలిచిపోయిన విషయం తాండా వాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.

పనులు వెంటనే ప్రారంబించి పూర్తయ్యే విదంగా చూస్తానని హామీ ఇచ్చారు. పడకల్‌లో రూ.30 లక్షలు, చుక్కాపూర్‌కు రూ.32ల క్షలు, పాతకోటతాండాలో రూ.30లక్షలతో, అంగన్వాడి కేంద్రాలు, సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పాఠశాలల కు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిదులు మంజూరు చేయించాని తెలిపారు.

తనకు పనిచేయడం మాత్రమే తెలుసునని అబద్దాలు మాట్లాడడంరాదని ఏదైతే చెప్పానో ఆది తప్పనిసరిగా పూర్తి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మండల అద్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి,సింగిల్ విండో ఛైర్మన్ కేశవరెడ్డి,మార్కెట్ కమిటి ఛైర్మన్ యాట గీతనర్శింహా,వైస్ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి, పిసిసి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు మోహన్ రెడ్డి, దాసరి యాదయ్య, రంగారెడ్డి, అంజయ్య గుప్త, అజీం, శంకర్ జీ, డిగ్రీ కృష్ణ, అజీజ్, డేవిడ్, పిర్యనాయక్, జీరనాయక్, గొపినాయక్, శ్రీనునాయక్, గోపాల్ నాయక్ లు పాల్గొన్నారు.