10-03-2025 01:33:31 AM
కల్వకుర్తి, మార్చి 9 : కల్వకుర్తి మార్కెట్లో ఆదివారం వస్తే సంతలో కూరగాయలు, నిత్యవసర వస్తువుల క్రయవిక్రయాల కోసం సామాన్యులకు చింత తప్పడం లేదు. నూత న సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మా ణం పిల్లర్లకే పరిమితం కావడంతో సంతలో కూరగా యలు ఇతర సామాగ్రి విక్రయాలు జరిపే వారంతా నడిరోడ్డు పైనే ఏర్పాటు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
అయినా మా ర్కెటింగ్ శాఖ అధికారులు ఇటు మున్సిపల్ శాఖ అధికారులు అంటి ముట్టనట్టు వ్యవహరించడంతో సామాన్యులు విక్రయదారులు గృహిణిలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నడిరోడ్డుపై అపరిశుభ్ర వాతావర ణంలోనే కూరగాయలు విక్రయించడంతో అనేక వైద్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
నిత్యం తైబజార్ ఇతర టాక్సీలు వసూలు చేస్తే మున్సిపల్ శాఖ అధికారులు శాశ్వత పరిష్కారంగా నూతన మార్కెట్ యార్డ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవడం లేదు దీంతోపాటు ట్రాఫిక్ పోలీసులు సైతం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి ఆదివారం జరిగే ఈ సంత వలన పలు ప్రాంతాలకు రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు మండి పడుతున్నారు.
2022లో గత ప్రభుత్వం నూతన సమీకృత వ్యవసాయ మార్కెట్ నిర్మాణం కోసం 4.50 కోట్లు వెచ్చించారు. కానీ ప్రస్తుతం ఆ పనులు పిల్లర్లకే పరిమితం రావడంతో కూరగాయల క్రయ విక్రయాలు నడిరోడ్డు పైనే జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన సమీకృత కూరగాయల మార్కెట్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.