హాజరైన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి, రాజేశ్‌రెడ్డి
కల్వకుర్తి, డిసెంబర్ 4: కల్వకుర్తి వ్యవసా య నూతన మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకరోత్సవం బుధవారం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరె డ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బో ర్డు మెంబర్ టాకూర్ బాలాజీ సింగ్ హాజరయ్యారు.
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వావిళ్ల ఉమ మనీలా, వైస్ చైర్మన్‌గా పండిత్ రావ్‌తో సహా మార్కెట్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం రైతులకు న్యాయం చేకూర్చాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు ఆనంద్‌కు మార్, భూపతిరెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ పాల్గొన్నారు.