calender_icon.png 1 April, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి క్రీడా పోటీలకు కల్వకుర్తి గురుకుల విద్యార్థులు

27-03-2025 12:53:48 AM

నాగర్ కర్నూల్ మార్చి 26 (విజయక్రాంతి): తెలంగాణలోని హన్మకొండలో ఈనెల 15, 16న జరిగిన  సీనియర్ టెన్నికాయిట్ చాంపియన్ షిప్ పోటీల్లో కల్వకుర్తి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శ్రీనిధి, 9వ తరగతి చదువుతున్న  మమత,జాహ్నవిలు అత్యున్నత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కల్వకుర్తి గురుకుల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సింధూజ బుధవారం ఒక ప్రకటనలో  తెలిపారు.

ఈనెల 26 నుంచి 29 వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరంలో  జరిగే జాతీయ స్థాయి సీనియర్ టెన్నికాయిట్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్. టి.నాగమణి, ఫిజికల్ డైరెక్టర్ సింధూజ మరియు సిబ్బంది  అభినందించారు.