28-02-2025 01:17:32 AM
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 27 ( విజయ క్రాంతి): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన బాగోతం ఎవరికి తెలియదన్నట్లుగా విమర్శలు చేస్తున్నారని భువనగిరి పార్ల మెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మద్యం వ్యాపారులతో దొంగ వ్యాపారం చేసి అక్కడి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది కవిత కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు ఏమి మాట్లాడారు అనేది మూడో వ్యక్తి తెలియదు కానీ, తమ పార్టీపై అభండాలు వేస్తున్నారని ఆమె తెలిసినట్లుగా మాట్లాడడం శోచనీయ మన్నారు.
ఏదో ఒక విషయంపై ఆ కుటుం బం నుండి ఎవరో ఒకరు బయటకు వచ్చి విమర్శలు చేయడం వారికి అలవాటుగా మారిందని ఈసారి ఆమె వంతు వచ్చి మా ట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒకటే జట్టని పేర్కొనడం విడ్డూరం. జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టకుండా బిజెపితో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకొని మద్దతు ఎవరికీ ఇస్తున్నారో అందరికి తెలుసు అన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ అంటే తెలం గాణకు కట్టుబడి ఉంటుందని పేర్కొనడం శోచనీయమని, పదేండ్ల పాలనలో ఇష్టాను సారంగా రాష్ట్రాన్ని దోసుకుని విదేశాలలో పెట్టుబడులు పెట్టి. 7 లక్షల కోట్లు అప్పులు పాలు చేసిన టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. మీ అన్న కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడై ఐ లైఫ్ పబ్బు లాంటి మేజర్ కార్యక్రమాలు హైదరాబాదులో నడిపిన వ్యక్తి దుబాయ్ లో చనిపోయిన సంఘటనపై విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు తెలియజేయడాలనుకోవడం తప్ప అని ఆయన ప్రశ్నించారు.
అధికారం కోల్పోగానే దళితులు, అభివృద్ధి గుర్తొ చ్చిందా అని ఎంపీ ప్రశ్నించారు. మరోసారి తెలంగాణ ప్రజలకు పిట్టకథలు చెప్పి ఉద్య మం సమయంలో చెప్పిన చిల్లర మాటలు చెప్పి మోసం చేద్దామని చూస్తే పదేళ్లు మోసపోయిన తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.