calender_icon.png 18 January, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పరువు తీస్తున్న ‘కల్వకుంట్ల’

18-01-2025 01:01:12 AM

* లొట్టపీసు కేసుపై కేటీఆర్‌కు భయమెందుకు?

* స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, జనవరి 17 (విజయక్రాంతి): పదేళ్ల పాలనలో అందినకాడికి దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం జైళ్లకు వెళ్తూ తెలంగాణ పరువు తీస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఈ రేసు కేసు లొట్టపీసు కేసు అం  కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

శుక్రవారం జనగామ జి  రఘునాథపల్లి మండలంలోని నిడిగొండలో జరిగిన కాంగ్రెస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఏడాదిలో పాలనలో స్టేష  ప్రాంతానికి ఎన్నో నిధులు వచ్చాయని, చాలా పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. అనంతరం వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య జైలు, బెయిలు బంధం కొనసాగుతుందన్నారు.

తెలంగాణలో కాం  ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్య  కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, నాయకులు కోళ్ల రవిగౌడ్, పోరెడ్డి మల్లారెడ్డి, మాసాన్‌పల్లి లింగాజీ పాల్గొన్నారు.