20-03-2025 12:14:42 AM
కల్పవృక్షం కోరికలు తీరుస్తుందనేది పురాణోక్తి. ఈ మొక్కలు ధనవంతులను చేస్తాయని, ఇంటికి శ్రేయస్సును చేకూర్చే శక్తి వాటిలో ఉంటుందని చెప్తారు చాలా మంది జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో ఉంటుందీ వృక్షం. అంబానీ గార్డెన్‌లో ఇవి నాలుగు ఉన్నాయని చెప్తారు.
అంబానీల ముచ్చట అటుంచి, సినీప్రముఖుల విషయానికొస్తే.. మన టాలీవుడ్ ‘రాజాసాబ్’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట్లో కూడా ఈ కల్పవృక్షం దర్శనమిస్తుంది. ఈ మొక్క ఖరీదు అక్షరాలా కోటి రూపాయలట! అయితే, ఈ కల్పవృక్షం.. దాని ప్రయోజనాలపై భిన్న వాదనలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి అభిప్రాయాలను అనుసరించి..
కల్పవృక్షం నాటడం వల్ల ధనప్రాప్తి ఎంతమేరకు కలుగుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. అంబానీల తర్వాత ఈ వృక్షాన్ని ప్రభాస్ కలిగి ఉండటమనేదే ఇండస్ట్రీకి గొప్ప విషయం. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ఇప్పుడు ‘రాజాసాబ్’ కోసం పనిచేస్తున్నారు. ఇంకా ఆయన నుంచి ‘కల్కి2’, ‘సలార్2’, ‘స్పిరిట్’ చిత్రాలు రావాల్సి ఉంది. ఇవీగాక ప్రశాంత్‌వర్మతో మరో చిత్రాన్ని కూడా ప్రభాస్ చేయనున్నారు.