హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ముషీరాబాద్, జనవరి1: దోమలగూడలోని రామకృష్ణ మఠంలో బుధవారం కల్ప పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కల్పతరు పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజలు, హోమం, ఆల ప్రదక్షిణం, ఆరాత్రికంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కల్పతరు దినోత్సవ ప్రాధాన్యాన్ని వివరించారు.పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులను ఉద్దేశించి హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద ప్రసంగించారు. 1886 జనవరి 1న పశ్చిమ కాశీపూర్ ఉద్యానవనంలో మధ్యాహ్నం 3 గంటల సమ శ్రీ రామకృష్ణ పరమహంస కల్పవృక్షంలా మారి భక్తుల కోరికలు తీర్చారని స్వామి బోధమయానంద తెలిపారు.