05-03-2025 04:37:57 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రఖ్యాత గాయని కల్పన తన కుమార్తెతో వివాదం కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందిస్తూ, కల్పన కుమార్తె దయ ఖండించింది. కల్పన పరిస్థితి గురించి విన్న కుమార్తె కేరళ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కల్పన కుమార్తె దయ మీడియాతో మాట్లాడుతూ... తన తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె సింగర్ మాత్రమే కాదు.. ప్రసుత్తం కల్పన ఎల్ఎల్బీ పీహెచ్‌డీ చేస్తున్నట్లు తెలిపారు. ఇటివల కల్పన ఇన్ సోమ్నియాతో బాధపడుతున్నారని వెల్లడించారు. వైద్యులు సూచించిన నిద్ర మాత్రలను మాత్రమే తీసుకునేవారని, ఒకింత ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం వల్లే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారని చెప్పారు.
అంతేకానీ మా అమ్మ ఆత్మహత్య చేసుకోలేదని తెల్చి చెప్పారు. దయచేసి తప్పు కథనాలు సృష్టించవద్దని మీడియాను కోరింది. కల్పనకు ఎలాంటి కుటుంబ సమస్యలు లేవని, తామ కుటుంబమంతా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని హోలిస్టిక్ ఆసుపత్రి( Holistic Hospital)లో గాయని కల్పనకు చికిత్స అందిస్తున్నారు. గాయని కల్పన నిద్రమాత్రలు మింగినట్లు వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో కల్పనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. కల్పనకు ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. కల్పన కోలుకున్నాక ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయనున్నారు.