మధుసూదనాచారి
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తే కాళోజీ ఆత్మ ఘోషిస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసత్యవాది అయిన రేవంత్రెడ్డి సత్యవాది అయిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడం సరికాదన్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ను అమలు చేయని కాంగ్రెస్కు వరంగల్లో విజయోత్సవ సభ పెట్టే హక్కు లేదన్నారు. ఏడాది పాలనలో ప్రజలెవ్వరూ సంతోషంగా లేరని, కాంగ్రెస్ విద్వేష సభలు పెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ను తక్కువ చేసి చూపడం తప్ప రేవంత్ ప్రభుత్వానికి ఏదీ చేత కావడం లేదన్నారు.