* పీవీ మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర భారతీలో పీవీ మెమోరియల్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హాజరయ్యారు.
ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. బహు బాషా కోవిదుడుగా పేరుగాంచి పీవీ మంచి పరిపాలనాదక్షుడిగా, ఆర్థికవేత్తగా, సంస్కరణల కర్తగా పాలనలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
సాహిత్యంలో పీవీ నరసింహారావుది కాళోజీ నారాయణరావులది గురుశిష్యుల బంధమని వెల్లడించారు. కార్యక్రమంలో పీవీ సోదరుడు పీవీ మనోహర్ రావు, మాజీ ఎంపీలు టీ సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచందర్‌రావు, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.