calender_icon.png 15 January, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాళోజి జయంతి

09-09-2024 03:53:39 PM

మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారము కాళోజి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్పత్తి సునీత  మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలలో రాజకీయ సాంఘిక చైతన్యాలను నింపిన, పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకు ఇచ్చిన మహనీయుడు ప్రజాకవి కాళోజి నారాయణ అని, ఆయన జయంతి ని పురస్కరించుకొని  తెలంగాణ భాష దినోత్సవము  నిర్వహించడం జరుగుతుందన్నారు. కాళోజి తెలంగాణ భాషకు, యాసకు, తెలంగాణ సమాజానికి చేసినటువంటి సేవలను, కృషిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ సాహిత్య పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగ అధిపతులు సరిత, రజిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.