calender_icon.png 2 October, 2024 | 5:55 AM

అన్యాయాన్ని ఎదిరించిన కవి కాళోజీ

10-09-2024 04:29:39 AM

జయంతి వేడుకల్లో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ భాష, యాస కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి ప్రజా కవి కాళోజీ అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్‌మెంట్ హెచ్ వోడీ ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నారు. సోమవారం కాళోజీ జయంతి, తెలం గాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. అన్యాయానికి ఎదురొడ్డిన మహనీ యుడు కాళోజీ అని కొనియాడారు. 

కార్యక్ర మంలో ఆచార్య పీ వారిజారాణి, ఆచార్య వీ త్రివేణి, డా.పీ విజయ్‌కుమార్, డా.బాశెట్టి లత, ఆచార్య దార్ల వెంకటేశ్వ రరావు, ఆచార్య డీ విజయలక్ష్మి, డా. భూక్యా తిరుపతి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ నాయక్ పాల్గొన్నారు. 

జలమండలి ఎండీ అశోక్ రెడ్డి  ఆధ్వర్యం లో ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాల యంలో కాళోజీ చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. ఈడీ మ యాంక్ మిట్టల్, డైరెక్టర్లు వీఎల్ ప్రవీణ్‌కు మార్, రవికుమార్ పాల్గొన్నారు. 

మెదక్: కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కాళో జీ చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు.

రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. రిజిస్ట్రార్ రఘురామిరెడ్డి తదితరు లు పాల్గొన్నారు.