calender_icon.png 16 January, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళోజీ భవన్ పనులు త్వరగా పూర్తిచేయాలి

03-09-2024 03:57:15 AM

సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి

హనుమకొండ,సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): కాళోజీ కళాక్షేత్రం పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం పనులను సోమవారం మే యర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాక్షేత్రంలో ఏవైనా అదనపు పనులు ఉంటే నాలుగు రోజుల్లోగా పూర్తి చేసి, ఈ నెల 9న ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు.