24-04-2025 05:27:19 PM
కల్లూరు (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Matta Ragamayee Dayanand) ఆకస్మికంగా తనిఖీ చేసారు. జరుగుతున్న అంతర్గత సిసి రోడ్లు పనులను పరిశీలించి, ఆసుపత్రి నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణం ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు గదులు పార్మసి గదులు ఓపి గదులు తిరిగి పరిశీలించడం జరిగింది ఇంజనీర్ లతో ప్రారంభోత్సవం సమయానికి అన్ని సిద్ధం చెయ్యాలి పనులు పెండింగ్ ఉండకుండా చూడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎ.పి.యం రాంబాబు, సిసి, మండల కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు, ఏనుగు సత్యం బాబు, బాగం ప్రభాకర్ చౌదరి, పెద్దబోయిన శ్రీనివాస్ రావు, ఆళ్లకుంట నరసింహారావు, భైర్ల కాంతారావు, కృష్ణా రెడ్డి,మట్టా రామకృష్ణ, పంతులు నాయక్, యాసా శ్రీకాంత్, నల్లగట్ల పుల్లయ్య, మండల కాంగ్రెస్ నాయుకులు, గ్రామ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.