calender_icon.png 10 October, 2024 | 11:52 PM

కల్లు బాబు కల్లు.. మీ దగ్గరికి వచ్చాం

10-10-2024 09:23:41 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో కల్లు అమ్మకాలకు కల్లు మూస్తే దారులు కొత్త ఓ రా వాడికి శ్రీకారం చుట్టారు. కల్లు పెట్టెలను కారులో పెట్టుకుని కొనుగోలు దారుల ఇంటి వద్దకే వెళ్లి మైకు ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. చిల్లర వ్యాపారాలు చేసేవారు ఒక మైక్ పెట్టుకుని ద్విచక్ర వాహనంపై తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న తీరును పసిగట్టిన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ కు చెందిన మూస్తే దార్లు కల్లు అమ్మకాలపై కొత్త ఒరవడి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. గతంలో కల్లు దుకాణం వద్దకు వెళ్లి అవసరమైన వారు కల్లును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లేవారు.

వ్యాపారులో వచ్చిన పోటీ తత్వం వల్ల తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కొత్త ఒరవడిని నేర్చుకున్నారు.. అనుకుంటున్నారు ప్రజలు. కారులోనే కల్లు పెట్టెలను పెట్టుకొని విక్రయాలు కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త కల్లు మామూలాలు ప్రారంభం కావడంతో వ్యాపారులు కొత్త ఓరవాడిని నేర్చుకున్నారు. ఇన్నేళ్లుగా ఎప్పుడు చూడలేదని గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. కల్లు వ్యాపారులు మాత్రం కల్లు ప్రియులకు అందుబాటులో కల్లును తీసుకెళ్లి విక్రయించి వ్యాపారాన్ని పెంచుకుంటున్నట్లు తెలుపుతున్నారు. ఏది ఏమైనా కామారెడ్డి జిల్లాలో కారులో కల్లు పెట్టెలను తీసుకెళ్లి వ్యాపారాన్ని కొనసాగించడం గ్రామస్తులను ఆశ్చర్యపరుస్తుంది. కళ్ళు వ్యాపారుల మధ్య పోటీ వల్లనే ఇలా అమ్మకాలు చేపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కళ్ళు వ్యాపారం ఒక కొత్త ఓరవాడిని సృష్టించి నట్లయింది.