19-03-2025 12:00:00 AM
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ విడుదలై పదేళ్లు అవుతున్న సంద ర్భంగా ఆ సినిమాని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. నాని హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతు వర్మ కీలక పాత్రల పోషించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించారు. మార్చి 21న సినిమా రీరిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ఒక లవ్ ఎటాచ్‌మెంట్ ఉన్న అరుదైన సినిమా అని ఆయన పేర్కొన్నారు. “పదేళ్లకు ముందు ఎంత రెలెవెంట్ గా ఉండేదో ఇప్పటికీ సినిమా అంతే రెలవెంట్‌గా ఉంటుందని భావిస్తున్నా. సినిమాకు ఇప్పుడు ఇంకా ప్రాధాన్యత పెరిగింది. రీరిలీజ్‌లో సినిమాని ఎంతమంది చూస్తారో అందులో ౧౦ శాతం ఆడియన్స్ బెటర్‌గా ఫీల్ అయితే, ఒక చిన్న పాజిటివిటీ సినిమా వాళ్లకి ఇస్తే థట్స్ గ్రేట్.
చాలా పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్లు రావచ్చు. కానీ కొన్ని సినిమాతోనే ఒక లవ్, అటాచ్‌మెంట్ ఉంటుంది. తెలుగు ఫిలిం హిస్టరీలో నాకు మూడు, నాలుగు సినిమాలు అలా ఉంటాయి. ఎవరైనా ఫ్యాన్స్ కనిపించినప్పుడు, సినిమా గురించి మాట్లాడినప్పుడు అలాంటి లవ్ అటాచ్మెంట్ ఉన్న సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనిపిస్తుంది. ‘ఎవడే, మహానటి, కల్కి’ల్లో ది బెస్ట్ అయితే ‘మహానటి’. ఈ సినిమా చాలా సంతృప్తినిచ్చింది.
ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిలిం చేద్దామని ‘ఎవడే..’ ఆలోచన రాయడం మొదలుపెట్టాను. నిజానికి ఈ సినిమాని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని అనుకోలేదు. కానీ ఇది నాని, స్వప్న, ప్రియాంకలకి నచ్చింది. -ప్రతి మనిషిలో రిషి, సుబ్బు రెండు కోణాలు ఉంటాయి. నేను కొన్నాళ్లు రిషి లాగా తిరిగాను. సుబ్బులా కూడా ఉన్నాను (నవ్వుతూ). ‘కల్కి2’ సినిమా ప్రిపరేషన్ జరుగుతోంది. ఇయర్ ఎండింగ్‌లో ఉండొ చ్చు” అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.