పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో వస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. జూన్ 27వ తేదీ నుంచి జులై 4వ తేదీ వరకు సినిమా టికెట్ ధరలను పెంచుకోవాడానికి అనుమతినిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కనిష్టంగా సింగిల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 వరకు, గరిష్టంగా రూ.200వరకు పెంచుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన మొదటి వారం వరకు ఐదు ప్రదర్శనలతో పాటు, విడుదల రోజున ఉదయం 5.30 గంటలకు బెనిఫిట్ షోలు వేసుకునేందుకు సమ్మతించిన తెలంగాణ సర్కారు, ఈ టికెట్ ధర రూ.495 మించకూడదని నిబంధన విధించింది. పెరిగిన ధరల ప్రకారం.. రెగ్యూలర్ షోలకు టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్‌లో రూ.265, మల్టీప్లెక్స్‌లో రూ.413 దాటొద్దని చెప్పింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సుమారు రూ.600కోట్లతో నిర్మించిన ‘కల్కి’ సినిమాకి ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు సమ్మతించిన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది.