భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ‘కల్కి’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. దేశ వ్యాప్తంగా సినిమా గురించి చర్చ సాగుతుంటే.. ప్రచార కార్యక్రమాల్లో కనబడని నాగ్ అశ్విన్, సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ లైవ్‌లో ‘కల్కి’ క్లుమైక్స్.. సినిమాలో నటించిన ప్రభాస్‌కి సైతం షాక్ ఇవ్వనుందంటూ పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్నట్టు “కల్కి’లో యువ హీరోలైన నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లతో పాటు మరికొందరు తారలు భాగమైనట్టు తెలిపిన ఆయన, 20 నిమిషాల తర్వాత భైరవ పాత్ర తెరమీదికి రానుంది.
ఆ సన్నివేశాలకు థియేటర్లు అరుపులు కేకలతో హోరెత్తిపోతాయ”న్నారు. కొనసాగిస్తూ ‘కల్కి థీమ్ గీతానికి అందరూ ముగ్దులవుతారన్న ఆయన, సినిమా క్లుమైక్స్ ప్రభాస్‌కి సైతం షాక్ ఇవ్వనుందంటూ” సినిమాపై అంచనాలు మరింత పెంచారు. ఇందులో పాల్గొన్న ప్రభాస్ “కల్కిలో భాగమైన దుల్కర్, విజయ్‌లకు ధన్యవాదాలు చెబుతూ.. సినిమా విడుదల తర్వాత పది రోజులు విరామం తీసుకుని ‘కల్కి 2’ పనులు ఆరంభించమంటూ” దర్శకుడికి సూచించారు.
- కల్కిలో అశ్వత్థామ, సుప్రీమ్ యాస్కిన్ పాత్రలు పోషించిన భారతీయ చిత్ర పరిశ్రమలోని మేటి నటులు అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా ఒకే తెరపై కనపడనున్నారు. దీనికి ముందు వీరిద్దరూ 1985లో వచ్చిన ‘గిరిఫ్తార్’లో కలిసి నటించారు. ఇందులో రజనీకాంత్ కూడా భాగమవ్వటం గమనార్హం.
- తొలిరోజు బుకింగ్స్ పది లక్షలకు పైగా (13.5 లక్షలని అంచనా) టిక్కెట్లు అమ్ముడు పోగా.. వీటి విలువ సుమారు 40 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది భారతీయ సినిమాలోనే సరికొత్త రికార్డు. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కేవలం నైజాం నుండే ఇరవై కోట్లు వసూలు చేసిందీ చిత్రం.