calender_icon.png 17 January, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళింగ లాన్సర్స్ విజయం

16-01-2025 11:44:20 PM

హాకీ ఇండియా లీగ్

భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో కళింగ లాన్సర్స్ మూడో విజయాన్ని అందుకుంది. గురువారం రూర్కెలా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ 5 ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌పై గెలుపొందింది. కళింగ తరఫున బ్రింక్‌మన్ (ఆట 38వ, 43వ ని.లో) డబుల్ గోల్స్‌తో మెరవగా.. నికోలస్ (11వ ని.లో), ఆర్థర్ డోరెన్ (36వ ని.లో), గుర్సహి సింగ్ (45వ ని.లో) గోల్స్ చేశారు. ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌కు కోరే వెయిర్ (46వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంతో కళింగ లాన్సర్స్ 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలవగా ఢిల్లీ ఆఖరి స్థానానికి పరిమితమైంది. మహిళల హాకీ లీగ్‌లో బెంగాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒడిశా వారియర్స్ పెనాల్టీ షూటౌట్‌లో విజయాన్ని అందుకుంది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1 సమంగా నిలిచాయి. పెనాల్టీ షూటౌట్‌లో ఒడిశా 3 బెంగాల్ టైగర్స్‌పై విజయాన్ని అందుకుంది.