calender_icon.png 24 October, 2024 | 2:09 AM

కలి టీజర్ విడుదల

08-07-2024 12:05:00 AM

ప్రిన్స్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో శివ శేషు దర్శకత్వం వహిస్తున్న సినిమా “కలి”. రుద్ర క్రియేషన్స్ సంస్థలో లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు చిత్ర రూపకర్తలు. కాగా“కలి” సినిమా టీజర్‌ని ‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆదివారం విడుదల చేశారు. స్వార్థం నిండిన ఈ లోకంలో బతకలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తి జీవితంలోకి ఓ అపరిచిత వ్యక్తి ప్రవేశిస్తాడు.

తర్వాత ఏం జరిగిందన్న ఆసక్తకిర కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అనంతరం నాగ్ అశ్విన్ మాట్లాడుతూ“కలి మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని, దర్శకుడు శివ శేషు కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోందని” అన్నారు. “కలి పాత్ర నేపథ్యంతో సాగే ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి” అని చిత్ర సమర్పకులు కె. రాఘవేంద్రరెడ్డి తెలిపారు. నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మధుమణి నటించిన ఈ సినిమాకి సంగీతం: జీవన్ బాబు, సినిమాటో గ్రఫీ: నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి, పాటలు: రామజోగయ్య శాస్త్రి.